Sunday, December 23, 2012

ప్రాచీన శవాలు

మా వాకిళ్ళలో పారే కన్నీరు మీకు కానరాదా !
మా  గుండెలపై పేలే అగ్నిగోల విస్ఫోటనాలు
మీకు వినబడవా! 
ఎంత కాలం మీ అహంకారం
ఎవడి వల్ల ఎవడి జన్మ చరితార్ధమైనది!
మీ సమస్త భవబంధ జాడ్యములకు సరైన ఔషదం
మా మూలవాసుల  అశుద్దాలయందు  
పురుగులై పునర్జన్మించడమే.

మీ మనుస్మృతి పుట్టిన్నాడే కదా 
కులతత్వం చేతిలో 
మానవత్వం బిక్కచచ్చి పోయింది... 
జీవధర్మమైన మా మరణాలు అసహజమై పోయింది.
ఆకలితో చంపబడ్డవాళ్ళం...ఊరి తీయబడ్డవాళ్ళం  !
శతాబ్ధాలుగా... 
దుర్మార్గ భయంకర మరనశాసనానికి లొంగ దీయబడ్డవాళ్ళం
ఊరవతలికి నెట్టివేయబడ్డవాళ్ళం  . 
మూర్ఖులారా
మీరు బ్రతికున్న మనుషులనుకుంటురేమో
కాదు, 
వేల సంవత్సరాల నాటి ఎండు పీనుగలు మీరు 
ఎప్పుడో చచ్చిన ప్రాచీన శవానికున్నరక్తమాంసాలు మీరు 

(లక్ష్మీపేట లో జరిగిన దమనకాండ కు నిరసనగా నేను రాసిన పోయెం ఇది.రాశి చాలా రోజులైంది )

No comments:

Post a Comment